వివేకా హత్య వెనుక ఐదుగురు రాజకీయ పెద్దలు ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించ తగినది హైకోర్టుకు విన్నవించిన వివేకానందరెడ్డి భార్య, కుమార్తె, అల్లుడు హత్య కేసును సీఎం తారుమారు చేయొచ్చు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తరఫు న్యాయవాది వెల్లడి కేసు డైరీ, జనరల్ డైరీ సమర్పించాలని ప్రభుత్వానికి న్యాయమూర్తి స్పష్టీకరణ సీఎం తరఫు వాదనల కోసం విచారణ సోమవారానికి వాయిదా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసు.. సీబీఐ దర్యాప్తునకు అప్పగించడానికి తగినదని విన్నవించారు. ఈ మేరకు వారి తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక తన వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటున్నారని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్.బసంత్ కోర్టుకు తెలిపారు. వివేకా హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు లేదా సీబీఐకి అప్పగించాలని మృతుడి భార్య వైఎస్ సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇదే అంశంపై తెదేపా ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి( బీటెక్ రవి), మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మృతుని కుమార్తె ఎన్.సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాల్లో విచారణ తుది దశకు చేరింది. ముఖ్యమంత్రి పై పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణల పై వాదనలు వినిపించేందుకు విచారణ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు వివేకా హత్య కేసు జనరల్ డైరీ, కేసు డైరీలను తమ ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ కు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు గురువారం స్పష్టం
వివేకా హత్య వెనుక ఐదుగురు రాజకీయ పెద్దలు