ఘట్ కేసర్ మండలంలోని మర్పల్లిగూడ గ్రామ పంచాయితి ఆవరణలో పౌరహక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీసర డివిజన్ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు తాల్క రాములు గారు మాట్లాడుతూ... డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాలు, తెగల (అత్యచార నిరోధక) చట్టం-1989 ప్రకారం గ్రామాలలో ఇంకా అంటరానితనం, అస్యృశ్యతని ప్రోతహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారతరత్న అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ విజయలక్ష్మీ గారు, ఎస్సై విజయకృష్ణమూర్తి గారు, ఎంపిటీసీ గట్టగల్ల రవిగారు, వార్డు మెంబర్లు, ఆర్త్ షాహీం బేగం గారు, వీఆర్ వో హేమలత గారు, గ్రామస్తులు, అంబేద్కర్ యువజన సభ్యులు పాల్గొన్నారు.
పౌర హక్కుల దినోత్సవం