బెస్ట్ సెల్లర్ గెలాక్సీ ఎం30ఎసకు నూతన మెమరీ వేరియంటు ఆవిష్కరించిన శాంసంగ్

గురుగ్రామ్, ఇండియా- మార్చి 2020 : భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ , స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్, తమ అత్యుత్తమ విక్రయ గెలాక్సీ ఎం30ఎస్ కు నూతన వేరియంట్ 4/128 జీబీ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ నూతన 4/128 జీబీ వేరియంట్ గెలాక్సీ ఎం30ఎస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లు, అమజాన్ డాట్ ఇన్, శాంసంగ్ సొంత ఆన్ లైన్ స్టోర్లలో లభ్యమవుతుంది. గెలాక్సీ ఎం30ఎస్ ను సాంకేతిక ప్రియులైన మిల్లీనియల్స్, జెన్ జెడ్ యొక్క వైవిధ్యమైన అవసరాలను తీర్చే రీతిలో మానెస్టర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్ సీ 15 వాట్ ఫాస్ట్ చార్జర్ వంటివి ఉన్నాయి. పరిశ్రమలో అత్యున్నత బ్యాటరీ కలిగిన గెలాక్సీ ఎం30ఎస్ కేవలం 8.9 ఎంఎం మందం కలిగి ఉండటంతో పాటుగా కేవలం 188 గ్రాముల బరువు ఉంటుంది. ఇది వినియోగదారులు పట్టుకోవడానికి మరియు స్మార్ట్ ఫోన్ ను తీసుకోవడానికి అత్యంత సౌకర్యాన్ని అందిస్తుంది. గెలాక్సీ ఎం30ఎస్ అత్యంత అందమైన 6.4 ఎఫ్ హెచ్ డీ + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ యు డిస్ ప్లే అత్యద్భుతమైన మరియు ప్రకాశవంతమైన రంగులను అందిస్తుంది. గెలాక్సీ ఎం30ఎస్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా కలిగి ఉండటంతో పాటుగా అత్యద్భుతమైన చిత్రాలను వినియోగదారులు తీసుకునే అవకాశం కల్పించింది. గెలాక్సీ ఎం80ఎ లో శక్తివంతమైన 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో యూజర్లు, తాము చూసిన ప్రపంచాన్ని ఒడిసిపట్టుకునే అవకాశం కల్పిస్తుంది. పూర్తిగా అంకితం చేయబడిన 5 మెగా పిక్సెల్ ఇప్పుడు లైవ్ ఫోకస్ ఫీచర్ తో వస్తుంది. 16 మెగా పిక్సెల్ కెమెరా తమతో పాటుగా సెల్ఫీ ఫోకస్, ఇన్-డిస్ ప్లే ఫ్లాష్ ఉన్నాయి. గెలాక్సీ ఎం30ఎస్ లో పూర్తిగా అంకితం చేయబడిన నైట్ మోడ్ లో-లైట్ షాట్స్ మరియు అత్యుత్తమ శ్రేణి వీడియో సామర్థ్యం ఉంది. గెలాక్సీ ఎం80ఎస్ ఎక్సీనాస్ 9611 ఆక్టా కోర్ ప్రాసెసర్ 2.8 గిగా హెర్జ్ వేగాన్ని అత్యున్నత శ్రేణి గేమింగ్ పనితీరును అందిస్తుంది. గెలాక్సీ ఎం80ఎస్ స్మార్ట్ ఫోన్లు అత్యద్భుతమైన డ్యూయల్ టోన్ రంగులు- ఓపల్ బ్లాక్, సఫైర్ బ్లూ మరియు క్వార్డ్ గ్రీన్ లో లభిస్తాయి. గెలాక్సీ ఎం30ఎస్ 4/128 జీబీ ధర 14999 రూపాయలు. ఈ ఫోన్లు అన్ని రిటైల్ స్టోర్లు, అమజాన్ డాట్ ఇన్, శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్లలో మార్చి 14,2020 నుంచి లభిస్తున్నాయి. పరిచయ ఆఫర్‌గా, వినియోగదారులు నూతన 4/128 జీబీ వేరియంట్ గెలాక్సీ ఎం30ఎస్ ఇప్పుడు హెచ్ డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పై 5% క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.