కస్టమర్ ఫస్ట్ - సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందిస్తామని వాగ్దానం చేస్తున్న మెక్ డొనాల్డ్స్ పరిశుభ్రమైన మరియు సురక్షితమైన అనుభవాలకు భరోసా అందిస్తూ ఈ రెస్టారెంట్ చైన్ అత్యంత కఠినమైన ప్రమాణాలను తీసుకుంది ముంబై, మార్చి 2020 : ప్రస్తుత ఆరోగ్య ఆందోళనల నేపథ్యంలో, దక్షిణ భారతదేశంతో పాటుగా పశ్చిమ భారతదేశంలో మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లను సొంతం చేసుకుని నిర్వహిస్తున్న వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ కంపెనీ, ఇప్పుడు ఆహార పరిశ్రమకు మార్గనిర్దేశకత్వం చేస్తూ సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం మాత్రమే అందిస్తామంటూ వెల్లడిస్తుంది. ప్రపంచశ్రేణి ఆరోగ్య మరియు పరిశుభ్రతా ప్రక్రియలకు ఎల్లప్పుడూ భరోసానందించే ఈ రెస్టారెంట్ చైన్ ఇప్పుడు తమ భద్రతా ప్రక్రియలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటుగా రెట్టింపు జాగ్రత్తలు తీసుకుంటూనే ఎవ్వరూ వేలెత్తి చూపని రీతిలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ వినియోగదారులకు సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహార అనుభవాలను అందిస్తుంది. భారతదేశంలో క్లోజ్డ్ లూప్ సప్లయ్ చైన్ కలిగిన అతి కొద్ది క్యుఎస్ఆర్లలో ఒకటైన మెక్ డొనాల్డ్ ఇండియా - ఇప్పుడు సరఫరా మొదలు రెస్టారెంట్ లకు ఆహారం చేరేవరకూ తమ సురక్షితా ప్రక్రియలను పునరుద్ఘాటిస్తుంది. మెక్ డొనాల్డ్ తీసుకుంటున్న చర్యలను గురించి హార్డ్ కాసెల్ రెస్టారెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ స్మితా జతియా మాట్లాడుతూ “మేము చేసే ప్రతి ప్రయత్నంలోనూ మా వినియోగదారులే కీలకంగా ఉంటారు. క్యుఎస్ సీవీనాణ్యత, సేవలు, స్వచ్ఛత మరియు విలువ అనేవి మా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమైన నాటి నుంచి మూల స్థంభాలుగా వెలుగొందుతున్నాయి. మా ఆహారం 100% ఫార్మ్ లో కనిపిస్తుంది. ప్రపంచశ్రేణి వ్యవసాయ సాంకేతికతలను అవి ఉపయోగించుకోవడంతో పాటుగా అత్యున్నత శ్రేణి ఉత్పత్తులను సృ పిస్తుంది. కోల్డ్ చైన్ ఉపయోగించి దీనిని రవాణా చేయడంతో పాటుగా రెస్టారెంట్ల వద్ద కూడా ఇదే అనుసరిస్తూ, సాటిలేని పరిశుభ్రతా ప్రమాణాలతో దీనిని నిర్వహించడంతో పాటుగా అందిస్తారు. ప్రస్తుత ఆరోగ్య ఆందోళనల నేపథ్యంలో, మేమిప్పుడు ఈ ప్రమాణాలను మరింత కఠినతరం చేయడంతో పాటుగా మరింత సురక్షితమైన మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని మా వినియోగదారుల కోసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం” అని అన్నారు. పశ్చిమ మరియు దక్షిణ భారతదేశంలో మెక్ డొనాల్డ్ ఇండియా అనుసరిస్తున్న పరిశుభ్రతా ప్రక్రియలు : • కిచెన్ సిబ్బంది అంతా కూడా ఆహారాన్ని గ్లోవ్స్ తో మాత్రమే పట్టుకుంటారు. ప్రతి రెండు గంటలకూ వీటిని మారుస్తారు. • ప్రతి వినియోగం తరువాత ఫుడ్ ట్రేలు అన్నీ కూడా శుభ్ర పరచబడతాయి. • ప్రతి వినియోగం తరువాత ట్రే మ్యాట్స్ ను సైతం మారుస్తారు • సిబ్బంది అంతా కూడా ప్రతి గంటకూ 20 సెకన్ల పాటు చేతులను యాంటీ మైక్రోబియాల్ హ్యాండ్ వాష్ తో శుభ్రపరుచుకుంటారు ప్రతి వినియోగం తరువాత టేబుల్సను శుభ్రపరుస్తారు • శాఖాహార మరియు మాంసాహారంను నిర్వహించేందుకు ప్రత్యేకంగా శుభ్రపరిచిన, ప్రత్యేక రంగులు కలిగిన వస్త్రాలను మాత్రమే వినియోగిస్తారు. • రెస్టారెంట్ లాబీ మరియు కిచెన్ కోసం ప్రత్యేకమైన మామ ను వినియోగిస్తారు • వాష్ రూమ్ ను తరచుగా శుభ్రపరుస్తారు • 3-సింక్ శుభ్రతా ప్రక్రియలు - వాష్, క్లీన్ మరియు శానిటైజ్ వేడి నీళ్లలో క్లీనింగ్ మామ్ ను శుభ్రపరచడం ద్వారా పూర్తిగా శుభ్రపరచబడ్డాయనే భరోసాను అందిస్తున్నారు • శానిటైజర్ల బలానికి భరోసా అందించేందుకు తరచుగా పీహెచ్ పరీక్షలను చేస్తారు • అన్ని టచ్ పాయింట్ల వద్ద పరిశుభ్రతకు భరోసా అందించేందుకు క్లీన్ యాజ్ యు గో (మీరు వెళ్లిన వెంటనే శుభ్రం చేయడం) ప్రక్రియను అనుసరిస్తారు. భద్రతకు భరోసా అందిస్తూ పరిశుభ్రతా ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేశారు • సిబ్బంది అందరికీ కీలకమైన ఆరోగ్య ప్రమాణాలను తరచుగా పర్యవేక్షిస్తుంటారు • మా సిబ్బంది యొక్క ప్రయాణ చరిత్రతో పాటుగా కుటుంబ ఆరోగ్యం సైతం పరిశీలన • క్రెడిట్ కార్డు మెషీన్లను సైతం తరచుగా శుభ్రపరచడం • సెల్ఫ్-డిస్పెన్సింగ్ కోక్ మెషీన్ ప్యానెల్ ను తరచుగా శుభ్రపరచడం • టేబుల్ ట్రాకర్లను తరచుగా పరిశుభ్రపరచడం • అన్ని ఇతర కస్టమర్ టచ్ పాయింట్లు అయినటువంటి సెల్ఫ్ ఆర్డరింగ్ కియోస్క్ లేదా ఎ ఓకె స్క్రీన్, డోర్ హ్యాండిల్స్, హ్యాండ్ రెయిల్స్ సైతం తరచుగా శుభ్రపరచడం చేస్తారు వీటితో పాటుగా, కంపెనీ ఇప్పుడు తమ సరఫరా చైన్ ను సైతం పూర్తిగా పరిశీలించడం చేస్తుంది. తద్వారా తమ వినియోగదారుల సంక్షేమానికి భరోసా అందిస్తుంది. తమ అన్ని సరఫరాల కోసం అత్యంత కఠినమైన స్కానింగ్ పద్ధతులను ఇది స్వీకరిస్తుంది. తద్వారా తమ సరఫరా దారులంతా కూడా తమ ప్లాంట్ల వద్ద ఆహార భద్రతా నిర్వహణ వ్యవస్థలను నిర్వహిస్తారన్న భరోసా కలిగిస్తుంది. తమ సరఫరాదారుల వద్ద పనిచేసే ఉద్యోగులు సైతం ప్లాంట్ లోకి ప్రవేశించక మునుపు లేదా తమ షిఫ్ట్ లకు వెళ్లే ముందు అత్యంత కఠినమైన పరిశుభ్రతా ప్రమాణాలను అనుసరించడంతో పాటుగా పరీక్షలను కూడా వారికి చేయాలని నిర్దేశిస్తుంది. ఆహార భద్రతా ప్రక్రియలో అన్ని చిన్న అంశం పట్ల సైతం పూర్తి ఆప్రమప్తతను కంపెనీ చూపుతుంది.
పరిశుభ్రమైన ఆహారం అందిస్తామని వాగ్దానం చేస్తున్న మెక్ డొనాల్డ్స్