ఆకర్షణీయమైన ఆఫర్

కన్స్యూమర్ డ్యూరబల్స్ పై శాంసంగ్ అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్ లతో ఉగాది పండుగలో లీనమవండి ; 15% వరకూ క్యాష్ బ్యాక్ ను పొందండి శాంసంగ్ క్యుఎల్ ఈడీ టీవీతో 76,900 రూపాయల వరకూ విలువ కలిగిన గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ను ఉచితంగా అందుకోవడంతో పాటుగా విస్తరించిన వారెంటీ, సులభమైన వాయిదా పద్ధతుల్లో జీరో డౌన్ పేమెంట్ సైతం పొందవచ్చు మార్చి 2020 : అత్యంత శుభప్రదమైన ఉగాది పండుగను వేడుక చేస్తూ, భారతదేశంలో అతి పెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ ఫోన్ బ్రాండ్, శాంసంగ్ నేడు ప్రత్యేకమైన ఆఫర్లను తమ వినియోగదారుల కోసం ఆవిష్కరించింది. ఈ ఉత్సాహపూరితమైన ఆఫర్లు, ఆకర్షణీయమైన ఋణ పథకాలతో పాటుగా సులభమైన వాయిదా పద్దతులు, జీరో డౌన్ పేమెంట్ వంటివి మార్చి 31,2020 వరకూ లభ్యమవుతాయి. ఈ ఆనందకరమైన క్షణాలను మరింత ఆహ్లాదకరంగా మలుస్తూ, ఈ ఆఫర్లు ఖచ్చితమైన ప్రయోజనాలను శాంసంగ్ ఉత్పత్తులైనటువంటి క్యుఎల్ ఈడీ టీవీ, 4కె యుహెచ్ డీ టీవీ, కన్వెక్షన్ మైక్రోఓవెన్ కపుల్డ్, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు, ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు, ఎకో- బబుల్ వాషింగ్ మెషీన్స్, డిజిటల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్స్ వంటివి కొనుగోలుచేసిన వినియోగదారులకు అందిస్తుంది. అదనంగా, 15% క్యాష్ బ్యాక్ ను సైతం పొందవచ్చు. ఆఫర్ పీరియడ్ లో భాగంగా, శాంసంగ్ క్యుఎల్ ఈడీలో ఎంపిక చేసిన మోడల్స్ ను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఖచ్చితమైన బహుమతిని 76,900 రూపాయల విలువ కలిగిన గెలాక్సీ ఎస్ 10 (512 జీబీ)ని 10సంవత్సరాల నో స్క్రీన్ బర్న్ ఇన్ వారెంటీతో అందిస్తుంది. మై శాంసంగ్ మై ఈఎంఐ సర్వీతో వినియోగదారులు ఎలాంటి క్లిష్టత లేని కొనుగోలును అతి సులభమైన ఈఎంఐ మరియు డౌన్ పేమెంట్ ద్వారా తమ బడ్జెట్ కు అనుగుణంగా ఎంపిక చేసిన రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లను కొనుగోలు చేయవచ్చు. అదనంగా, సంప్రదాయ మైక్రోవేవ్ ఓవెన్ ఎంపిక చేసిన మోడల్స్ కొనుగోలుపై, వినియోగదారులు ఉచిత బోరోసిల్ కిట్ ను 28 లీటర్లు మరియు ఆ పైన కన్ఫెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్స్ పై అందిస్తుంది మరియు


10 సంవత్సరాల వారెంటీని సెరామిక్ ఎనామిల్ కేవిటీపై మరియు 5 సంవత్సరాల వారెంటీని మాగ్నెట్రాన్ పై అందిస్తుంది. ఈ ఆఫర్ పీరియడ్ లో భాగంగా శాంసంగ్ ఇప్పుడు ఐదు సంవత్సరాల పీసీబీ కంట్రోలర్ వారెంటీని ఎంపిక చేసిన ఎయిర్ కండీషనర్ మోడల్స్ పై అందిస్తుంది. “కన్స్యూమర్ డ్యూరబల్స్ దగ్గరకు వచ్చేసరికి, ప్రజలు ఇంధన సామర్థ్యం కలిగిన మరియు సౌకర్యవంతమైన ఉత్పత్తులకు అప్ గ్రేడ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. శాంసంగ్ వద్ద, మేము అర్ధవంతమైన ఆవిష్కరణలను విశ్వసిస్తుంటాం. అవి వినియోగదారుల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మలుస్తుంటాయి. పండుగ సంబరాలకు మరింత ఆనందం తీసుకువస్తూ, అతి సులభమైన ఫైనాన్స్ పథకాలతో వస్తున్నటువంటి పండుగ ఆఫర్లు మా వినియోగదారులు తమ ఇళ్లలో ప్రకాశాన్ని అసలు కోల్పోని రీతిలో ఆస్వాదించగలరు” అని రాజు పుల్లన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు శాంసంగ్ యొక్క వైవిధ్యమైన ఉత్పత్తి శ్రేణి : శాంసంగ్ క్యుఎల్ ఈడీ మరియు 43 యుహెచ్ డీ టెలివిజన్స్ : శాంసంగ్ క్యుఎల్ ఈడీ మరియు 43 యుహెచ్ డీ టీవీలు, ప్రీమియం టీవీలు మరియు గృహ వినోదంలో అసాధారణతను తీసుకువచ్చాయి. అత్యంత అందమైన డిజైన్ ను అందించడంతో పాటుగా అత్యాధునిక చిత్ర నాణ్యతను ఇవి కలిగి ఉన్నాయి. ఈ టీవీలు వీక్షకులకు మరింత ప్రకాశవంతమైన, డీపర్ కలర్స్ ను వీక్షించే అవకాశం కల్పిస్తుంది. శాంసంగ్ సైడ్ బై సైడ్ మరియు ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు : సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు మరియు ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు , భారతీయ వినియోగదారుల వైవిధ్యమైన స్టోరేజీ అవసరాలను ఇవి తీరుస్తాయి. శాంసంగ్ రిఫ్రిజిరేటర్లు తాజాదనం, ఇంధన సామర్థ్యం, సమానమైన కూలింగ్, మన్నికల సమ్మేళనంగా ఉంటాయి. విద్యుత్ బిల్లుపై ఆదాను అందించడంతో పాటుగా అవాంతరాలు లేని కూలింగ్, తాజాదనంను విద్యుత్ కోతలలో సైతం అందిస్తుంది. శాంసంగ్ ఎకో బబుల్ మరియు టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు 8 శాంసంగ్ వాషింగ్ మెషీన్లు, డిజిటల్ ఇన్వర్టర్ మోటార్స్ శక్తితో వస్తాయి. ఇవి అతి తక్కువ విద్యుత్ ను వినియోగించుకోవడంతో పాటగుఆ అతి తక్కువ శబ్దం, వైబ్రేషన్ ను వాషింగ్ మెషీన్ నడుపుతున్నప్పుడు అందిస్తాయి. శాంసంగ్ యొక్క ఎకో బబుల్ టెక్నాలజీలో బబుల్ జనరేటర్ ను వినియోగించుకుని నీటిలో డిటర్జెంట్ ను కరిగించి, గాలిని ఇంజెక్ట్ చేస్తుంది తద్వారా మహోన్నతమైన సోపీ ఫోమ్ కుషన్ ను ఉత్పత్తి చేస్తుంది. వాషింగ్ మెషీన్ లోని శక్తివంతమైన హైజీన్ స్టీమ్ సైకిల్, వాష్ యొక్క క్లీనింగ్ నాణ్యతను వృద్ధి చేస్తుంది. ఇది డ్రమ్ యొక్క బాటమ్ నుంచి ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల, ప్రతి ఐటెమ్ పూర్తిగా శాచురేట్ అవుతుంది. ఇది మురికితో పాటుగా 99.9% బ్యాక్టీరియాను సైతం తొలగించి, అలెర్జీన్స్ ను నశింపజేస్తుంది. శాంసంగ్ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్స్ : భారతీయ కుకింగ్ ను శాంసంగ్ , మైక్రోవేవ్ ఓవెన్స్ లో విప్లవాత్మక ఆవిష్కరణలతో నవీకరించడంతో పాటుగా భారతదేశం కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వినియోగదారులు ఇప్పుడు మసాలా, తడ్కా, సన్ డ్రై ఫుడ్ ను తయారుచేయడంతో పాటుగా రోటీ/నాన్ తయారు చేయవచ్చు మరియు పెరుగును సైతం మైక్రోవేవ్ శ్రేణిలో తయారుచేయవచ్చు. శాంసంగ్ డిజిటల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్స్ : శాంసంగ్ ఎయిర్ కండీషననను ప్రత్యేకంగా వినియోగదారుల అవసరాలు, అంచనాలు దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారు. అత్యంత వేగంగా చల్లబడటం, అతి తక్కువ విద్యుత్ వినియోగించుకోవడం, రాజీలేని రీతిలో చల్లదనాన్ని వేసవి వేడిలో సైతం అందిస్తుంది. కన్వర్టబుల్ మోడ్ ను ఈ సంవత్సరం పరిచయం చేశారు. శాంసంగ్ యొక్క మరో మహోన్నతమైన సాంకేతికత ఇది. దీనిని యాక్టివేట్ చేస్తే, గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు వినియోగదారులు మరింత శక్తిని ఆదాచేయవచ్చు.